ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్ 28,2019) ఉదయం విడుదలయ్యారు. హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మారుతీరావు వెళ్లిపోయారు. పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేశారు. మారుతీరావు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలపై 2018 సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉంటున్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్ కోసం 2 నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పీడీ యాక్ట్ కేసులో బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురు హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 26,2019) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృతతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా.. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. తక్కువ కులం వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే కోపంతో మారుతీరావు ఈ పని చేశాడు. ఈ కేసులో మారుతీరావు ఏ1, శ్రవణ్ ఏ6, కరీం ఏ5 నిందితులు. ప్రణయ్ హత్యకు మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన నిందితుడు సుభాష్ శర్మ బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ కేసులో శర్మ ఏ2 నిందితుడు.
ప్రణయ్, అమృత 9వ తరగతి నుంచే ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదివేటప్పడు కూడా వీరి ప్రేమ కొనసాగింది. ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశారు. కూతురి ప్రేమ విషయం తెలిసి తండ్రి మారుతీరావు పలుమార్లు మందలించాడు. ప్రణయ్, అమృత.. 2018 జనవరి 30న ఇంటి నంచి వెళ్లిపోయి హైదరాబాద్‌లో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ప్రణయ్ హత్య సమయంలో 5 నెలల ప్రెగ్నెంట్ అయిన అమృత… ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చింది. సరిగ్గా ప్రణయ్, అమృతల పెళ్లి రోజునే వారికి బిడ్డ పుట్టడం విశేషం.