హెడ్ మాస్టర్ అరాచకాలు : భయపడి స్కూల్ మానేస్తున్న విద్యార్థినిలు

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 09:39 AM IST
హెడ్ మాస్టర్ అరాచకాలు : భయపడి స్కూల్ మానేస్తున్న విద్యార్థినిలు

Updated On : November 26, 2019 / 9:39 AM IST

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టారు బుద్ది లేకుండా ప్రవర్తించాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనతంపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రారెడ్డి విద్యార్థినిలతో పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు. చదువుకోవటానికి వచ్చిన ఆడపిల్లల పట్ల వెకిలిచేష్టలు చేశాడు. హెడ్ మాస్టర్ వెకిలి చేష్టలు ఎంత వరకూ వెళ్లాయంటే..వాడి వేధింపులకు భయపడి ఆడపిల్లలు బడి మానివేసే వరకూ వెళ్లింది.ఇలా ఒకరూ ఇద్దరూ కాదు ఎంతోమంది హెడ్ మాస్టర్ వేధింపులకు స్కూల్ మానేశారు.

అంతతటితో రవీంద్రారెడ్డి ఆగడాలు ఆగలేదు. విద్యార్ధులను వేధించటమే కాకుండా వారితో పనులు కూడా చేయిస్తున్నాడు. విద్యార్దు మధ్యహ్నాం భోజనం వారే వడ్డించాలని ఆంక్షలు పెట్టాడు.   విద్యార్దులకు మధాహ్నా భోజనంలో పెడుతున్న కోడిగుడ్లను కూడా అమ్ముకుంటున్నాడు.

అంతేకాదు..స్కూల్ ఫర్నీచర్ ని ఇంటికి తరలించుకున్నాడు. ఇలా రవీంద్రారెడ్డి ఆగడాలకు..అరాచకాలకు..అకృత్యాలకు హద్దూ పద్దూ లేకుండా పోయింది. రవీంద్రారెడ్డి చేసే అరాచాకాలకు స్టూడెంట్స్ అంతా హడలిపోతున్నారు. విద్యార్థినిలు స్కూల్ కు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్థినిలు స్కూల్ మానేసిన దుస్థితి నెలకొంది.