వీడియో : మందడంలో రైతుల కాళ్లమీద పడ్డ డీఎస్పీ

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 09:22 AM IST
వీడియో : మందడంలో రైతుల కాళ్లమీద పడ్డ డీఎస్పీ

Updated On : January 4, 2020 / 9:22 AM IST

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) వీరారెడ్డి నిరసన చేస్తున్న నిరసనకారుల కాళ్లమీద పడ్డారు. దీంతో రైతులు ఇదేంటీ ఇదేం పని అంటూ అడ్డుకున్నారు.  సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది.  

గత 18 రోజుల నుంచి రైతులు, మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి జిల్లాలోని మండడంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల కాళ్లపై డీఎస్పీ వీరా రెడ్డి పడిపోయారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ డీఎస్పీ రైతులకు దణ్ణం పెట్టి వేడుకున్నారు. డీఎస్పీ అలా హఠాత్తుగా కాళ్లపై పడటంతో రైతులు కంగారుపడ్డారు. దీంతో రైతులు ఖంగుతిన్నారు. 

కాగా..మందడంలో కొనసాగుతున్న నిరనస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులు సకల జనుల సమ్మె చేపట్టారు.ఈ సమ్మెను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో ఘటనాస్థలానికి వచ్చారు. మహిళలని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్లుగా కొట్టారు. దూషించారు. మెడలో తాళిబొట్లు కూడా లాగేశారు. కాళ్లతో తన్నారు. పిడిగుద్దులు గుద్దారు. ఇష్టమొచ్చినట్లుగా లాగి పడేశారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ క్రమంలో పోలీసులపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు..స్వచ్ఛంధ సంస్థలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇంట్లో ఉండే మహిళలు తమకు జరిగుతున్న అన్యాయం ప్రశ్నించటానికి నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యంత పాశవికంగా మహిళలపై విరుచుకుపడ్డారనీ..నినసన తెలిపే హక్కు వారికి లేదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై తాము దాడి చేయలేదనీ..వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో గాయాలయ్యాయని ఏఎస్పీ వివరణ ఇచ్చారు. ఈ క్రమంల డీఎస్పీ  మందడంలో నిరసన చేస్తున్నవారి కాళ్లమీద పడటం విశేషంగా మారింది.