ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు : ఈ అర్హతలు ఉంటేనే
అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హామీని నెరవేర్చే

అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హామీని నెరవేర్చే
అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడ్డాయి. మంగళవారం (సెప్టెంబర్ 10,2019) నుంచి దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తారు. అయితే ఆర్థిక సాయం పొందడానికి ఏం అర్హతలు ఉండాలి, విధివిధానాలు ఏంటి, అప్లికేషన్లు ఎక్కడ ఇస్తారు.. ఇలాంటి వివరాలను ప్రభుత్వం సోమవారం(సెప్టెంబర్ 9,2019) ప్రకటించింది.
అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్స్ తో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్‌కంబర్డ్) ఖాతాను తెరవాలి.
* ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్ సాయపడతాడు.
* ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే సాయం
* దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి.
* అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.
* అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్‌ఎంఎస్ డేటాబేస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. * ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు.
* గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం జగన్ సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు.
రూ. 10 వేల సాయానికి అర్హతలు ఇవే:
* ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి.
* ఆటో రిక్షా/లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
* సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి.
* అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.
2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ నాలుగో వారంలో స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆటోలపై జీవితకాల పన్ను విధించారు. ఆటో, ట్యాక్సీలకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్‌లు, మరమ్మతులకు అయ్యే ఖర్చు ఏటా రూ.10 వేలకు పైగా ఉంటోంది. ఇది డ్రైవర్లుకు భారంగా మారింది. పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు జగన్ ను కలిసి తమ ఇబ్బందులు మొరపెట్టుకున్నారు. వారి సమస్యలను విన్న జగన్.. అధికారంలోకి రాగానే ఉపాధి కోసం ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్న వారికి రూ.10 వేల సాయం అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Also Read : అప్లయ్ చేసుకోండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు