రైల్వే బాదుడు : ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది. చిత్తూరు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడనున్నాయి. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగనుంది. దీన్ని దృష్టి పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచారు. ఇప్పటివరకు రూ.10 గా ఉన్న రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.20కి పెంచారు. సెప్టెంబర్ 30 నుంచి కొత్త ధర అమల్లోకి వస్తుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. బ్రహ్మోత్సవాల సీజన్ కావడంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోనున్నాయి. దీంతో అధికారులు ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ ఫామ్ పై ప్రయాణికుల రద్దీని కొంతవరకు నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 9 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 29న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4న శ్రీవారికి గరుడ సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడసేవకు విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులు, వీఐపీలు, ఉద్యోగులు, పోలీస్, మీడియా తదితరుల కోసం ఉద్దేశించిన గ్యాలరీలు, గతేడాది అనుభవాల గురించి అధికారులకు తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చర్చించారు.