అభివృద్ధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయి : హరీశ్ రావు

మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదనీ..మాటల కోటలు దాటాయి తప్ప చేతలు గడప కూడా దాటలేదని ఎద్దేవా చేశారు.
30 రోజుల ప్రణాళికను ఏడాదిలో మూడు సార్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ..దాంట్లో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మెదక్ ను స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మల్కాపూర్ బాటలోనే అన్ని గ్రామాలు నడవాలని హరీశ్ రావు సూచించారు.
కాగా అభివృద్దిలో ఎంతో వెనుబడి ఉండే మల్కాపూర్ గ్రామం ఇప్పుడు స్వచ్ఛతతో అలరారుతోంది. ఒకప్పుడు అపరిశుభ్రంగా ఉన్న మల్కాపూర్ ఇప్పుడు పరిశుభ్రంగా ఉంది. దీని కోసం గ్రామ ప్రజలు..యువత కృషికి నిదర్శనంగా నిలిచింది. మల్కాపూర్ పల్లె స్వచ్ఛ భారత్ చేపట్టి స్వచ్ఛ మల్కాపూర్ గా మార్చారు. అంతేకాదు ప్లాస్టిక్ అవగాహన పెంచుకున్న ప్రజలు ఓ ప్లాన్ ప్రకారంగా స్వచ్ఛ మల్కాపూర్ గా తీర్చిదిద్దుకున్నారు. ఈ క్రమంలో మల్కాపూర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ గ్రామం నడవాలని ప్రతీ పల్లె స్వచ్ఛ గ్రామాలుగా వెలగాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.