చంద్రబాబు సీనియార్టీపై మోడీ చురకలు

గుంటూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు. సీనియార్టీ వెన్నుపోటు పొడవడంలోనే చూపిస్తున్నాడు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కొడుకును వృద్ధి చేసుకోవడమే సరిపోతుందని తిట్టిపోశారు. తెదేపా శ్రేణులు మోడీ గ్యో బాక్ అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. చంద్రబాబు గురించి మాట్లాడటానికే ఇక్కడకు వచ్చానని చెప్తూ పార్టీ విలువలు మర్చిపోయి కాంగ్రెస్ ముందు మోకరిల్లాడని గుర్తు చేశారు. చంద్రబాబును తిట్టిపోసిన మోడీ వ్యాఖ్యలిలా..
- కొన్ని సత్యాలను చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.
- ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను మార్చుతామన్న సీఎం, తానే మారిపోయాడు.
- రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పి తన పార్టీని నిర్మించుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
- బాబు.. నా కన్నా తానే సీనియర్ అని చెప్తున్నారు.
- నిజమే, పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కూటములు కట్టడంలో మీకు మీరే సీనియర్లు.
- మామకు వెన్నుపోటు పొడవడంలో మీరే సీనియర్లు.
- ఆంధ్రాకలలకు నీరుగార్చడంలో మీరే సీనియర్లు.
- ఇన్నాళ్లు మీరు సీనియర్ నాయకులనే మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ వచ్చాను.
- ప్రజాసంక్షేమం విషయంలో మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం చూస్తూ ఊరుకోను.
అంటూ ప్రసంగం ఆసాంతం చంద్రబాబునే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధుల గురించి అడిగితే పారిపోతున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేస్తున్నారే కానీ, అభివృద్ధి చేసే ఆలోచనే లేదని విమర్శలు ఎక్కుపెట్టారు.