ఏపీ బీజేపీకి షాక్ : జనసేనలోకి ఆకుల

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 06:45 AM IST
ఏపీ బీజేపీకి షాక్ : జనసేనలోకి ఆకుల

Updated On : January 7, 2019 / 6:45 AM IST

విజయవాడ : ఏపీ బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత ..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఆకుల జనవరి 7న రాజీనామా చేసి..లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఆకుల రాజీనామా లేఖ సమర్పించేందుకు ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నట్లు సమాచారం.బీజేపీ కి రాజీనామా చేసిన తరువాత ఆకుల జనసేనలో చేరనున్నట్లుగా రాజకీయ వర్గాల పక్కా సమాచారం.ఈ విషయంపై ఇప్పటికే ఆకుల పవన్ తో సంప్రదింపులు జరగా.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆకుల సత్యనారాయణ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.