సింహాచలం పంచగ్రామాల భూసమస్య పరిష్కారమైంది : గంటా

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 07:25 AM IST
సింహాచలం పంచగ్రామాల భూసమస్య పరిష్కారమైంది : గంటా

విశాఖ : సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమైందన్నారు మంత్రి గంటా శ్రీనివాస్ రావు. పంచగ్రామాల భూ సమస్యకు చట్ట సవరణ చేశామన్నామని పేర్కొన్నారు. కేబినెట్ చట్టసవరణ బిల్లును ఆమోదించిందని తెలిపారు. పంచగ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింహాచలం భూసమస్య చాలా జఠిలమైన సమస్యగా తయారైందని అయినా పరిష్కారం చూపామని తెలిపారు. సింహాచలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కొత్తగా ఏర్పడ్డ ఏపీ మొట్టమొదటి కేబినెట్ జూన్ 12, 2014న విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిందన్నారు. తొలి కేబినెట్ లో జరిగిన అనేక అంశాలతోపాటు పంచగ్రామాల భూముల సమస్యను విశాఖ జిల్లాకే అతి ముఖ్యమైన సమస్యగా గుర్తించి కేబినెట్ లో ఎజెండాగా పెట్టించి.. దానిపై చాలా డిటెయిల్డ్ గా చర్చించి, దానికొక పరిష్కారం కనుక్కోవాలని తొలి కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. కానీ దురదృష్టవశాత్తు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నప్పటికీ… అనేక రకాల అవాంతరాలు వచ్చాయన్నారు. చట్టపరమైన సమస్యలు, లీగల్ గా కొన్ని ఇబ్బందులు, వేరే కోర్టు కేసులు.. రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ సమస్య జఠిలమైంది… తప్పా సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయామని చెప్పారు.

దఫా దఫాలుగా కలెక్టర్ తో మీటింగ్ లు పెట్టాం.. ఆర్డీవోలతో మీటింగ్ లు పెట్టాం..ఎమ్మార్వో, జాయింట్ కలెక్టర్లతో మీటింగ్ లు పెట్టించామని తెలిపారు. రెవెన్యూ సెక్రటరీలతో కూడా మీటింగ్ లు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో సత్యనారాయణ మూర్తి చాలా టైమ్ తీసుకుని డిటెయిల్డ్ గా మాట్లాడారని.. మిగిలిన సభ్యులు కూడా మాట్లాడారని..కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ సమస్య కొలిక్కిరాలేదన్నారు. 

2019 జనవరి 25 న పసుపు..కుంకుమ కార్యక్రమానికి విశాఖకు సీఎం చంద్రబాబు వచ్చారని.. తిరుగు ప్రయాణం చేసేటప్పుడు సీఎంకు సమస్యను చెప్పామని గుర్తు చేశారు. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఎంతో జఠిలమైన సమస్యలను పరిష్కారం చేశామన్నారు. కానీ వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న సింహాచలం భూసమస్యకు పరిష్కారం చూపించలేక పోయామని వాపోయారు.

ఇది ఐదు గ్రామాలు కాదు.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇది గవర్నమెంట్ కే సవాల్ గా మారుతుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి షాక్ కు గురయ్యారని.. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి..ఎందుకు జాప్యం అవుతుంది… వెంటనే చట్ట సవరణ చేసి.. ఏజీతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే కలెక్టర్ ఏజీతో మాట్లాడి లీగల్ ఓపీనియన్ తీసుకుని.. చట్టం సవరణ చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరూ సూచన చేశారని పేర్కొన్నారు. కలెక్టర్ సీఎంవో, ప్రభుత్వానికి రిపోర్టు పంపించారని.. వెంటనే సింహాచలం భూసమస్య పరిష్కారానికి ఆమోదం కావాలనే ఉద్దేశంతో కేబినెట్ సమావేశం పెట్టారని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమైందన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు చట్ట సవరణ చేశామన్నామని పేర్కొన్నారు. కేబినెట్ చట్టసవరణ బిల్లును ఆమోదించిందని తెలిపారు.