శైలపుత్రిగా శ్రీశైలం భ్రమరాంబికాదేవి

శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నంది వాహనాన్ని అధిరోహించి..నెలవంకను శిరస్సున అభరణంగా ధరించి, కుడిచేత శూలాన్ని, ఎడమ చేత పద్మాన్ని ధరించి, హిమవంతుని కుమార్తెగా..శైలపుత్రిగా భక్తులకు దర్శనమిస్తోంది.
రాత్రి 7 గంటలకు ‘శైలపుత్రి’ అలంకారంలో- అమ్మవారిని కొలువు తీర్చిన ఆలయ అర్చకులు రాత్రి 8 గంటలకు భృంగి వాహనంపై మల్లికార్జున స్వామివారి సహితంగా శైలపుత్రి అమ్మవారిని ఆలయం నుంచి తోడ్కొని వచ్చి..అనంతరం మాడవీధుల్లో ఊరేగిస్తారు.
శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామిగా కొలువైన శివుడి సతీమణిగా భ్రవరాంభికాదేవిగా అవతరించారు. స్వామివారి దేవాలయానికి వెనుకవైపు అమ్మవారు భ్రమరాంబికా దేవిగా కొలువై పూజలందుకుంటున్నారు. శరన్నవారాత్రి ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంభికాదేవి శైలపుత్రిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శించుకుంటున్నారు.