వీఐపీ బ్రేక్ దర్శనం : శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్

శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 10:23 AM IST
వీఐపీ బ్రేక్ దర్శనం : శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్

Updated On : November 5, 2019 / 10:23 AM IST

శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు

శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి భక్తుల కోసం మరో సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు ఇవ్వొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కు కనీసం రూ.10వేలు విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ అధికారులు ఒక ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తారు.

టికెట్ నమోదు చేసుకున్న సమయం నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కోటాలో ప్రతి రోజూ 500 టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు. శుక్రవారం మాత్రం కేవలం 200 టికెట్లు మాత్రమే కేటాయిస్తామన్నారు.

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం టీటీడీ ఇటీవలే శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి ట్రస్ట్) పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. వీఐపీ దర్శనం కోసం భక్తులు రూ. 10వేలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు సైతం వీఐపీ దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

విరాళం ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విరాళంగా ఇచ్చే రూ. 10వేలతోపాటు టికెట్‌ను రూ.500తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామని అధికారులు చెప్పారు.