రాజధానిపై జగన్ నిర్ణయం సరైనదే: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్మాణం అంటూ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మాట్లాడిన ఆయన.. ఇది మంచి చర్య అని అన్నారు. ఉత్తరాంధ్రలో సచివాలయం, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్లనే రాష్ట్రం విడిపోయిందని అన్నారు.
విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు ఉద్యోగులను ఉన్నపళంగా అమరావతి తీసుకొచ్చారని అన్నారు. సచివాలయాన్ని విశాఖలో పెట్టినాయ కూడా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.