ప్రాణం తీసిన పబ్‌జీ : గేమ్ ఆడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

పబ్‌జీ గేమ్‌ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 01:55 PM IST
ప్రాణం తీసిన పబ్‌జీ : గేమ్ ఆడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

Updated On : September 11, 2019 / 1:55 PM IST

పబ్‌జీ గేమ్‌ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

పబ్ జీ గేమ్ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. పబ్‌జీ గేమ్‌ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ గాజువాక చినకొరాడ ప్రాంతానికి చెందిన వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు లోహిత్‌ 10వ తరగతి చదువుతున్నాడు. విరామం లేకుండా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌ ఆడుతుండటంతో అతన్ని నుంచి తల్లి ఫోన్‌ను లాక్కుంది. దీంతో లోహిత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆగస్టు 27న లోహిత్‌ నుంచి తల్లి సెల్ ఫోన్ లాక్కుతుంది. ఈక్రమంలో తనకు పబ్ జీ గేమ్ కావాలంటూ బాలుడు ఏడ్చడంతోపాటు తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఎంత ఏడ్చినా ఫోన్ ఇవ్వడం లేదు. బాలుడు ఆ గేమ్ కు అడిక్ట్ కావడంతో చదువుకు కూడా దూరం అయ్యాడు. కుమారున్ని పబ్ జీ గేమ్ ఆడనివ్వొద్దని తల్లిదండ్రులు ఫోన్ తీసుకెళ్లారు. 

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాలుడు నీటిలో చీమలమందు కలుపుకుని తాగాడు. అది గమనించిన తల్లిదండ్రులు కుమారున్ని శీలానగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం (సెప్టెంబర్ 10, 2019) రాత్రి 1 గంట ప్రాంతంలో అతను మరణించారు.

పది లక్షల రూపాయలను ఖర్చు చేసినా బాలుడు దక్కకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పబీ జీ లాంటి ప్రమాదకర గేమ్ లను సెల్ ఫోన్ నుంచి తొలగించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. పబ్ జీ గేమ్ ఆడొద్దన్నందుకు కొందరు ప్రాణాలు తీసుకోగా, మరి కొంతమంది ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి. పబ్ జీ గేమ్ మాయలో పడి తమ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు.