కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఖరారు
నేడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూప రాణి పేర్లు ఖరారయ్యాయి.

నేడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూప రాణి పేర్లు ఖరారయ్యాయి.
నేడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూప రాణి పేర్లు ఖరారయ్యాయి. రాజేందర్‌రావును మేయర్‌గా చేసేందుకు మంత్రి గంగుల విశ్వప్రయత్నాలు చేసినా.. టీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం సునీల్‌రావు వైపు మొగ్గు చూపింది. మేయర్ గా సునీల్ రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
మేయర్ పదవి కోసం సీనియర్ నేతలు సునీల్ రావు, రాజేందర్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీ పడ్డారు. అయితే అధిష్టానం మాత్రం చివరకు సునీల్‌రావు వైపే మొగ్గు చూపింది. మేయర్ గా సునీల్ రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. సునీల్‌రావు వరుసగా నాలుగోసారి గెలుపొందారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రస్తుతం ఐదోసారి విజయం సాధించారు. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
60 స్థానాలున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో సంపూర్ణ మెజార్టీ లభించింది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నిన్న టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో టీఆర్‌ఎస్ బలం 40కి చేరింది. భారతీయ జనతా పార్టీ 13 డివిజన్లలో గెలవగా, ఎంఐఎం 6 డివిజన్లు, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు.