రైతులకు అండగా.. న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం

  • Published By: vamsi ,Published On : December 31, 2019 / 04:43 AM IST
రైతులకు అండగా.. న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం

Updated On : December 31, 2019 / 4:43 AM IST

కొత్త సంవత్సరం వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది తెలుగు దేశం పార్టీ. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు. నూతన సంవత్సర వేడుకలకు పార్టీ తరపున టీడీపీ నేతలు, కార్యకర్తలు దూరంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలకు ఖర్చు చేసే డబ్బును అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీలకు విరాళం ఇవ్వాలని సూచించారు.

ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని, రైతుల కుటుంబాలకు అండగా ఉండాలని, రైతులకు అండగా ఉండి వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్రాంతంలో రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు కొత్త సంవత్సరం రోజున టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో ఆయన పర్యటించనున్నారు.