వాడు పనికిమాలినవాడు..  రోజా ఆడరౌడీ!

  • Published By: vamsi ,Published On : March 12, 2019 / 05:03 AM IST
వాడు పనికిమాలినవాడు..  రోజా ఆడరౌడీ!

Updated On : March 12, 2019 / 5:03 AM IST

ఏపీలోని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు ఆడ రౌడీలను తయారుచేసి తెలుగుదేశం మీదకు వదులుతుందంటూ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. పేరు ప్రస్తావించకుండా రోజాను ఆడరౌడీ అనే కోణంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తే సహించమని, చంద్రబాబు బంగారం అంటూ చెప్పుకొచ్చింది. చంద్రబాబు ఏంటో ప్రతీ ఒక్కరి మన:స్సాక్షికి తెలుసునని అన్నారు. తెలుగుదేశం గూటి నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన వారు అంతా ఏదో ఆశించి వచ్చినవాళ్లని, ఏం క్లారిటీ లేక చివరకు వెళ్లిపోయారని ఆమె చెప్పుకొచ్చారు. కేసిఆర్‌కు వాళ్ల రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు, అన్యాయాలు కనబడట్లేదని, ఆంధ్రలోని అభివృద్ధిని అడ్డుకునేందుకే చూస్తున్నారంటూ ఆమె ఆరోపించింది.
అలాగే తెలంగాణలో ఉండే సినిమా వాళ్లు అక్కడి ప్రభుత్వం ప్రెజర్ కారణంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సాయం చేయకుండా.. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, సినీ నటులు గౌరవం నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు. పరోక్షంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్లో పోసాని మాటలను ప్రస్తావిస్తూ పేరు చెప్పకుండానే పోసానిని పనికిమాలిన సినిమావాడు అంటూ విమర్శించింది. చంద్రబాబుపై ఎన్ని సినిమాలు తీసినా చంద్రబాబు ప్రతిష్టను తగ్గించలేరని, చంద్రబాబు గురించి తెలుసుకోవాలంటే సినిమాలు చూడవలసిన పరిస్థితిలో ఆంధ్రప్రజలు లేరంటూ చెప్పింది.