అమెరికా బూస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి మృతి

వాషింగ్టన్: అమెరికాలోని బూస్టన్ బీచ్‌లో తెలంగాణ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు రెస్క్యూ టీమ్ కు సమాచారమందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న టీమ్ ఆదివారం రాత్రంతా గాలించినా సోమవారం రాత్రికి శ్రవణ్ కుమార్ మృతదేహం లభ్యమయ్యింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రెడ్డి శ్రావణ్‌కుమార్ అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈస్టర్ రోజున సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి దగ్గర్లోని బీచ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయాడు. ఈ మేరకు స్నేహితులు శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.