YCP నేతలతో మాకు ప్రాణహాని: నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత

నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 07:52 AM IST
YCP నేతలతో మాకు ప్రాణహాని: నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత

Updated On : April 15, 2019 / 7:52 AM IST

నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

నెల్లూరు : నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తిరుమల నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో వైసీపీ కార్యాలయం వద్ద తిరుమల నాయుడు భార్య సాయి అన్విత ఆందోళన చేపట్టారు.  వైసీపీ నేతల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్విత ఆవేదన వ్యక్తంచేశారు. 
Read Also : తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

నా భర్తపై దాడి చేసిన వైసీపీ  కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అన్విత చేపట్టిన ఆందోళనతో వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అన్వితకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు.  కాగా ఏప్రిల్ 14న వైసీపీ కార్యకర్తలు రాళ్లతోను,ఇనుప రాడ్లతోను తిరుమల నాయుడుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తిరుమల నాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి వెనుక నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

కాగా తిరుమల నాయుడుపై జరిగిన దాడిని ఖండిస్తు 14వ తేదీన వైసీపీ కార్యాలయం వద్ద  టీఎన్ ఎస్ ఎఫ్ ఆందోళన చేపట్టింది. అక్కడున్న ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి ఎక్కవారిని అక్కడికి పంపించి వేశారు. ఈ క్రమంలో  తిరుమల నాయుడు భార్య సాయి అన్విత ధర్నాకు దిగటంతో వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా