తీపి కబురు : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

  • Published By: madhu ,Published On : October 16, 2019 / 10:00 AM IST
తీపి కబురు : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

Updated On : October 16, 2019 / 10:00 AM IST

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత రంగానికి తీపి కబురు అందించింది. అలాగే హోం గార్డుల అలవెన్స్‌లు పెంచాలని, మత్సకార్మికులకు ఆర్థిక సాయం అందివ్వాలని..ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గం సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 

> మగ్గంపై ఆధార పడి జీవిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ఇటీవలే నిర్వహించిన పాదయాత్రలో సీఎం జగన్ పలు హామీలు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ మాటను ఆయన నిజం చేస్తున్నారని, వైఎస్సార్ చేనేత నేస్తం పేరిట పథకం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను గుర్తించేందుకు సర్వే జరుగుతోందని, అక్టోబర్ మాసంలోపు జాబితాను గ్రామసభల్లో ప్రదర్శిస్తామన్నారు. అందులో తప్పులు, అనర్హులున్నా, అర్హులకు స్థానం లేకపోతే..జాబితాల్లో చేరుస్తామన్నారు. డిసెంబర్‌లో సీఎం జగన్ చేతుల మీదుగా పథకం ప్రారంభిస్తామన్నారు. 
> ప్రాణాన్ని ఫణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారులను ఆదుకొనే విధంగా, వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్య కార్మికుడికి రూ. 10 వేలు అందివ్వాలని నిర్ణయం. మోటార్ బోట్లు, మోటార్ లేని బోట్లు లేని కుటుంబాలే కాకుండా..తెప్పలపై జీవనం సాగిస్తున్న వారిని పథకంలో భాగస్వాములు చేయాలని, నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున..సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించేందుకు మంత్రివర్గం నిర్ణయం. 
> వేట చేసే మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌పై రూ. 9  సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం. సబ్సిడీ మొత్తాన్ని నిర్దేశిత డీజిల్ బంకులు ఏర్పాటు చేసి..ఆ బంకుల్లో సబ్సిడీ అందివ్వాలని, ఆయిల్ సబ్సిడీ రూ. 100 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేసింది. 
> ముమ్ముడివరంలో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్ సముద్రంలో చేపట్టే తవ్వకాల కారణంగా..ఉపాధి కోల్పోయిన 16 వేల 050 మందికి బకాయిలు రూ. 81 కోట్లు చెల్లించాలని అయితే..ఓఎన్జీసీ డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాకపోతే ప్రభుత్వమే నవంబర్ 21న చెల్లించాలని నిర్ణయం. 
> 13 జిల్లాల్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించాలని లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు. ప్రతి ఇంటికి 105-110 లీటర్లు అందివ్వాలని, ఇందుకు కావాల్సిన అన్ని రకాల ఎస్టిమేటెడ్‌లు తయారు చేసి..ఏపీ డ్రింకింగ్ కార్పొరేషన్‌కు అన్ని రకాల సహాయం అందచేస్తుంది. సుమారు రూ. 4 కోట్ల 90 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా. 
> మధ్యాహ్న భోజనం నిర్వహించే వంట ఏజెన్సీలను ప్రోత్సాహించేందుకు వారికిచ్చే గౌరవ వేతనం రూ. 1000 నుంచి రూ. 3 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. దీని వల్ల 88 వేల 296 మంది మహిళా ఏజెన్సీలకు లబ్ది చేకూరుతుందని అంచనా. ఇందుకు రూ. 211 కోట్ల 91 లక్షలు ఖర్చు చేయడానికి మంత్రివర్గం తీర్మానం. 
> హోం గార్డులకు డైలీ అలవెన్స్ రూ. 600 నుంచి రూ. 700కు పెంచుతూ నిర్ణయం. 
> ఉద్యోగానికి డబ్బులు తీసుకుని..ఇచ్చే నెల వేతనాన్ని ఏజెన్సీలు వసూలు చేసుకోవడం లాంటి విషయాలు గత ప్రభుత్వ హాయాంలో వినడం జరిగిందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం 
> ప్రతి నిత్యం ప్రభుత్వం ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే నిరుద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సరాసరి కార్పొరేషన్ ద్వారా..వేతన కార్మికులకు అందరికీ వారి ఖాతాల్లోకి డబ్బులు వేయాలని నిర్ణయం. 
> పలాసాలో రూ. 51 కోట్లతో 211 పడకల నిర్మించాలని తలపెట్టిన కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్లలో 5 రెగ్యులర్ పోస్టులు, 100 కాంట్రాక్టు పోస్టులు, 60 ఔట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. 
> లా చదువుకుని బార్ అసోసియేషన్‌లో ఎన్ రౌల్ అయిన ప్రతి న్యాయవాదికి 3 సంవత్సరాల పాటు రూ. 5 వేలు డిసెంబర్ 03వ తేదీన జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని నిర్ణయం. 
> బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ నిరుద్యోగ యువతకు రూ. 20 వేలు ఆదాయం వచ్చే విధంగా చూడాలని, ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర లేకుండా..పారదర్శకంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా నియామకాలు చేపట్టేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.