జనసేన మూడవ జాబితా.. ఒక్క మార్పు

  • Published By: vamsi ,Published On : March 19, 2019 / 01:56 AM IST
జనసేన మూడవ జాబితా.. ఒక్క మార్పు

Updated On : March 19, 2019 / 1:56 AM IST

నామినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగా జనసేన పార్టీ  తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడవ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్ సభ మరియు 13 మంది అసెంబ్లీ అభ్యర్ధలను జనసేన మూడవ జాబితాలో విడుదల చేసింది. రెండవ జాబితాలోని ఒక స్థానాన్ని మార్పు చేస్తూ జనసేన మూడవ జాబితాను విడుదల చేసింది.  రెండో జాబితాలో షేక్‌ రియాజ్‌ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించగా.. మూడో జాబితాలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయి చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు.

లోక్ స‌భ అభ్య‌ర్థి:
ఒంగోలు – బెల్లంకొండ సాయిబాబు 

అసెంబ్లీ అభ్య‌ర్థులు: 
టెక్క‌లి – క‌ణితి కిర‌ణ్ కుమార్ 

పాల‌కొల్లు – గుణ్ణం నాగ‌బాబు 

గుంటూరు ఈస్ట్ – షేక్ జియా ఉర్ రెహ్మాన్ 

రేప‌ల్లె – క‌మ‌తం సాంబ‌శివ‌రావు 

చిల‌క‌లూరిపేట – మిరియాల ర‌త్న‌కుమారి 

మాచ‌ర్ల – కె. ర‌మాదేవి 

బాప‌ట్ల – పులుగు మ‌ధుసూధ‌న్ రెడ్డి 

ఒంగోలు – షేక్ రియాజ్ 

మార్కాపురం – ఇమ్మ‌డి కాశీనాథ్ 

గిద్ద‌లూరు – బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్ 

పొద్దుటూరు – ఇంజా సోమ‌శేఖ‌ర్ రెడ్డి 

నెల్లూరు అర్బ‌న్ – కేతంరెడ్డి వినోద్ రెడ్డి 

మైదుకూరు – పందిటి మ‌ల్హోత్ర‌ 

క‌దిరి – సాడ‌గ‌ల ర‌వికుమార్ (వ‌డ్డె ర‌విరాజు )