ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందాలి : గవర్నర్ హరిచందన్

విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచిస్తానన్నారు.
గిరిజనులు విద్యకు చదువులకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని..అన్ని రంగాల్లోను వారు నైపుణ్యం పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. చదువుకుని అన్ని పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు.