బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు : జగదీశ్ రెడ్డి

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 03:25 PM IST
బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు : జగదీశ్ రెడ్డి

Updated On : April 23, 2019 / 3:25 PM IST

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితాలు వెలువడకముందు నుంచే పథకం ప్రకారం కొన్ని పార్టీలు అపోహలు సృష్టించాయన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఆరోపణలు
అపోహలేనని అన్నారు. 

పరీక్ష విధానం, మూల్యాంకనంలో ఎలాంటి మార్పులు జరుగలేదన్నారు. గత పదిహేనేళ్లుగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. పరీక్షల్లో ఫెయిలవ్వడం చావు కారణం కాకూడదన్నారు. చదువు అనేది వెలుగు..కానీ అదే జీవితం కాదన్నారు. రీవాల్యుయేషన్ కు అవకాశం లేదని.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం ఉందన్నారు.