కాకతీయ కాలువలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహాలు!

కరీంనగర్ జిల్లా ఆలగనూరు కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కాలువో కొట్టుకొచ్చిన కారులో రెండు మృతదేహాలు ఉన్నాయి. కాలువలో కొట్టుకొచ్చిన కారును చూసిన స్థానులు పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే కారును బైటకు తీశారు. ఆ కారులో రెండు మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిపోయి ఉంటుందని అది అలా నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.
కారులో ఉన్న మృతదేహాలు ఉన్న పరిస్థితిని చూసిన పోలీసులు పది రోజు క్రితమే ఈ కారు కాలువలో పడిపోయిందని భావిస్తున్నారు. కారు ఎవరిది? ఆ మృతదేహాలు ఎవరివి అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా..ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ బైక్ పై వెళ్తున్న దంపతులు ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి గల్లంతు అయ్యారు సదరు దంపతుల మృతదేహాల కోసం కాలువ బ్యారేజ్ వద్ద గేట్లు వేసి నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. దీంతో కారు బైటపడింది.
ఆ కారు నారెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తిపేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు.కారు నంబర్ AP15 BN 3438 గా గుర్తించారు. కారుకు సంబంధిత వ్యక్తులు కరీంనగర్ వాసులుగా భావిస్తున్నారు.కాగా సదరు కారు పది రోజుల క్రితం కాలువలో పడి ఉంటుందని చీకటి సమయంలో ఇది జరిగి ఉంటుందని దాన్ని స్థానులకు ఎవరూ గుర్తించి ఉండకపోవచ్చు..ఈ క్రమంలో కాలువ నీటి ప్రవాహం తగ్గించటంతో కారు బైటపడిందని భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ మృతదేహాలు ఎవరివి? ఎప్పుడు ఈ ఘటన జరిగింది? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.