శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం : ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 03:41 PM IST
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం : ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి

Updated On : December 4, 2019 / 3:41 PM IST

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఇష్టకామేశ్వరి గేటు సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. రాజమండ్రి, ధర్మవరం డిపోలకు చెందిన బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు శ్రీశైలంకు చెందిన పుణ్యవతిగా, మరో మృతురాలు తిమిళనాడుకు చెందిన మహిళగా గుర్తించారు.

పుణ్యవతి భర్త నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అతను కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాజమండ్రి డిపోకు చెందిన బస్సు అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. శ్రీశైలానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి గేటు సమీసంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 మేర బస్సులు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఘాట్ రోడ్డులో మలుపులు ఉన్న ప్రదేశంలో స్లోగా వెళ్లాలని సూచన బోర్డులు ఉన్నా డ్రైవర్లు అతి వేగంతో బస్సులను నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. ఒకవేళ బస్సులు లోయలో పడి ఉంటే బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయే పరిస్థితి ఉండేదన్నారు.

సమాచారం అందుకున్న సున్నిపెంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను పక్కకు తప్పించారు. కిలో మీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.