టైమ్ పాస్ కోసం..గీకితే రూ.కోటిన్నర వచ్చింది…!!

  • Published By: nagamani ,Published On : August 14, 2020 / 05:08 PM IST
టైమ్ పాస్ కోసం..గీకితే రూ.కోటిన్నర వచ్చింది…!!

Updated On : August 14, 2020 / 5:51 PM IST

ఇదిగో ఈ కార్డు గీకండీ..అక్కడ ఎంత ఎమౌంట్ ఉంటే అది మీకే..స్క్రాచ్ కార్డులు విషయం అందరికీ తెలుసు.కానీ ఎన్ని సార్లు గీకినా అందే నండీ స్క్రాచ్ చేసి మహా వస్తే 25,50 రూపాయలు వస్తుంది. లేదా 100 లేదా 200 వందలు వస్తే గ్రేటే..వాళ్లకు లక్కున్నట్లే. కానీ అన్నిసార్లు అలా జరగదు. చాలాసార్లు ఒక్కరూపాయి కూడా రాదు. గీకీ గీకీ ఏమీ రాకపోతే హా…ఇంకెప్పుడు ఈ కార్డుల జోలికెళ్లకూడదని విసుగొస్తుంది.

కానీ లక్కుంటే డబ్బులొస్తాయి. కానీ కోట్లైతే రావుగా అనుకోవచ్చు..కానీ వర్జీనియాకు చెందని ఓ వ్యక్తికి మాత్రం లక్కు లక్ లా అతుక్కుంది. ఎంతగా అంటే ఏదో టైమ్ పాస్ కోసం ఓ స్క్రాచ్ కార్డు గీకాడు. అంతే..!! $200,000 తగిలాయి..అంటే మన కరెన్సీలో కోటిన్నరపైనే రూపాయలు..!!

దీంతో వర్జీనియా తల్లీ కొడకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంత డబ్బు గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్‌ స్క్రగ్స్‌. హెబర్ట్ తన తల్లితో కలిసి సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉంది. ఆ సమయంలో హెబర్ట్‌కు ఏం చెయ్యాలో పాలుపోవడంలేదు.

పైగా అమ్మతో నిత్యం ఇదో సరుకులు కొనటానికి రావటం నాపనైపోయింది అంటూ బోర్ గా ఫీలయ్యాడు. అలా ఆ షాపులో ఉన్న ఒక స్క్రాచ్‌‌ కార్డు మీద పడ్డాయి. గీకేద్దాంటే ఏం పోతుందిలే అనుకున్నాడు..ఏ ఏం వస్తుంది? ఎన్నిసార్లు ఇలా అవ్వలేదు..అనుకుని దాన్ని క్యాజువల్ గా జేబులో వేసుకున్నాడు.ఈలోపు త‌ల్లి షాపింగ్ ముగించుకుని వ‌చ్చింది. ఇద్ద‌రూ క‌లిసి ఇంటికి వెళ్లారు.

ఇంటికి వెళ్లిన చాలాసేపటికి త‌న వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డు జేబులో ఉందన్న విషయాన్ని గుర్తుకొచ్చి దాన్ని బైటకు తీసి..బరబరా గీకాడు. స్క్రాచ్‌కార్డును గీకగానే అందులో ఉన్న అంకెలను చూసి గుడ్లు మిటకరించాడు. షాక్ లో మాటల రాలేదు. తల్లిని పిలుద్దామంటే నోరుకూడా పెగల్లేదు.పరుగు పరుగులన అమ్మ దగ్గరకెళ్లి చూపించాడా స్క్రాచ్ కార్డుని. ఆమె అది చూసి షాక్ అయింది. కాసేపటికి ఇద్దరూ కలిసి ఎగిరి గంతేశారు.

ఆ కార్డు మీద అక్షరాలా 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లి కొడుకులు రాత్రికి రాత్రే అలా కోటీశ్వరులు అయిపోయారు.