గాజుల అలంకారంలో కనక దుర్గమ్మ

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 05:37 AM IST
గాజుల అలంకారంలో కనక దుర్గమ్మ

Updated On : October 29, 2019 / 5:37 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ చాలా పెద్ద కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిస్తోంది. లక్షలాది గాజులతో అమ్మవారిని అలంకరించారు అర్చకులు.
దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల్లోని ఉత్సవమూర్తులు, మల్లిఖార్జున మహా మండపంలో ఆవ అంతస్తులోని దుర్గమ్మ ఉత్సవ మూర్తిని కూడా గాజులతో అలంకరించారు.  

అమ్మవారిని గాజులతో అలంకరించేందుకు అపరాజితా భక్త బృందం సభ్యులు 30 వేల గాజులను దేవాలయం అధికారులకు అందజేశారు. అమ్మవారి మహిళా భక్త బృందాలు కూడా 10 లక్షల గాజులతో తయారు చేసిన గాజుల దండలను దేవస్థానానికి అందజేశారు. 

రంగుల రంగుల గాజుల అలంకారంలో సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారికి గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మట్టి గాజులు మహిళలు సౌభాగ్యానికి గుర్తుగా వేసుకుంటారనే విషయం తెలిసిందే.