వివేకానందరెడ్డిది హత్య అని భావిస్తున్నాం : ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 02:25 PM IST
వివేకానందరెడ్డిది హత్య అని భావిస్తున్నాం : ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

కడప : వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని భావిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఐపీసీ 302 కింద హత్య కేసుగా నమోదు చేశామన్నారు. వివేకానందరెడ్డి శరీరంపై ఏడు పదునైన గాయాలున్నాయని వెల్లడించారు. నుదురు, తల, వెనుక, తొడ, చేతిపై గాయాలున్నాయని వివరించారు. ఘటనా స్థలంలో కొన్ని ఫింగర్ ప్రింట్స్ సేకరించామని తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి

రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వెనుక డోర్ ఓపెన్ చేసి ఉంది.. ఆయన గదిలోకి రావడానికి ఇది ఒక్కటే అవకాశముందన్నారు. వైఎస్ వివేకా ఇంట్లోని మనుషులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.