దేశంలో బలమైన నాయకుడు జగన్.. అందుకే ట్రంప్ వస్తే ఆహ్వానించలేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందు విషయమై ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ క్రమంలో టీడీపీ అధినే చంద్రబాబు కూడా జగన్‌పై సెటైర్లు వేశారు.
దీంతో లేటెస్ట్‌గా ఇదే విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ట్రంప్‌తో విందుకు జగన్‌కు ఆహ్వానం అందకపోవడం, చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనే తెలివైనవారు.. మిగిలిన వారు అమయాకులు అని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
See Also>>దిశ చట్టం కోసం కమిటీ : జగన్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట
జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారని, నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని ప్రశ్నించారు బొత్స. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని.. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వం ఉన్నవాళ్లను పిలవలేదని అన్నారు మంత్రి. దేశంలో బలమైన నాయకుడు జగన్.. అందుకే జగన్‌ని ట్రంప్ వస్తే ఆహ్వానించలేదు అని మేం అనుకుంటున్నాం అని అన్నారు.
అలాగే మరేవైనా కారణాలు ఉండొచ్చని అన్నారు. ఈ దేశంలో జగన్ బలమైన నాయకుడని తాము బలంగా నమ్ముతున్నామని అన్నారు. ఏపీ ప్రజలకు అన్నీ తెలుసునని.. వాళ్లేం అమాయకులు కాదని అన్నారు బొత్స.