వెర్రి వేషాలేస్తే అంతే : నడివీధిలో భర్తను చితక్కొట్టేసిన భార్య

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 07:27 AM IST
వెర్రి వేషాలేస్తే అంతే : నడివీధిలో భర్తను చితక్కొట్టేసిన భార్య

నడి వీధిలో పెట్టిన భర్తను చితక్కొట్టేసింది ఓ భార్య. భర్తకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని భార్య భర్తను ఇష్టానుసారంగా కొట్టటానికి కారణం లేకపోలేదు.భర్త పెట్టే హింసలు తట్టుకుని..భరించి చివరకు సహనం కోల్పోయింది. ఎప్పటికైనా మారకపోతాడా అనే ఆశతో అతను పెట్టే బాధలన్నీ భరించింది. చీటికీ మాటికి భర్త కొడుతున్నా ఓర్చుకుంటు ఉంటు వాటికి భరించలేక చివరకు పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భర్త మారకపోవటంతో అందరి ముందు కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఘటన జరిగింది. 

సాంబశివరావుతో నాలుగేళ్ల క్రితం శైలజ అనే యువతికి పెళ్లి జరిగింది. రెండేళ్లు బాగానే ఉన్నా తరువాత భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. దీనికి కారణం సాంబశివరావు వరసకు మరదలు అయ్యే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా భర్త వినకపోవటంతో పుట్టింటివకి వెళ్లిపోయింది. ఈ క్రమలో ఓ రోజు హఠాత్తుగా భర్త ఇంటికి వచ్చిన శైలజ భర్త మరో మహిళతో కలిసి ఉండగా చూసి  నిలదీసింది.  రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవటంతో సాంబశివరావు ఆగ్రహించాడు. శైలజపై ఎదురు దాడికి దిగాడు. దీంతో బంధువులతో కలిసి భర్తపై దాడి చేసింది. అనంతరం ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటు ఆందోళన చేపట్టింది.