చిచ్చు పెట్టిన కుక్క : మహిళలను చితక్కొట్టిన కాంగ్రెస్ లీడర్

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 01:32 AM IST
చిచ్చు పెట్టిన కుక్క : మహిళలను చితక్కొట్టిన కాంగ్రెస్ లీడర్

Updated On : April 22, 2019 / 1:32 AM IST

సాధారణంగా ఆస్తుల కోసం కొట్టుకుంటారు. లేదా.. డబ్బుల కోసం గొడవపడతారు.. కానీ అక్కడ ఓ కుక్క కోసం కొట్లాడారు. ఓ కుక్క రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించేలా…వివాదం సృష్టించింది. కుక్క తెచ్చిన తంటాతో…రెండు కుటుంబాలు రోడ్డుకెక్కాయి. 
Also Read : నల్లాలో పడిన చిన్నారి… 15నిమిషాల్లోనే క్షేమంగా బయటకి

పెద్దపల్లి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ కుక్క ఉంది. పక్కింట్లో బహిర్భూమికి వెళ్లింది. ఇదే విషయాన్ని పక్కింటి మహిళలు…సందీప్‌కు చెప్పారు. దీంతో ఆగ్రహించిన సందీప్‌….ఇద్దరు మహిళలను చితక్కొట్టుడు కొట్టాడు.

ఇరుగు పొరుగు వారు సర్దిచెబుతున్న సందీప్‌ ఆగలేదు. మహిళలపై పిడిగుద్దులు కురిపించాడు. ఇటు వైపు అడ్డుకుంటే అటు వైపు…అటు వైపు వెళ్లి అడ్డుకుంటే ఇటు వైపు వచ్చి మహిళలను వీరబాదుడు బాదాడు. ఇద్దరు మహిళలు కింద పడినా కట్కూరి సందీప్‌ వదిలిపెట్టలేదు. వారి మీద పడి గొడ్డును బాదినట్లు బాదేశాడు. ఇదంతా అక్కడున్న వారు…సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేపట్టారు.
Also Read : కొలంబో కకావికలం : 10 ఏళ్ల తర్వాత పేలుళ్లు