హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు బైటపడ్డాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ నవీన్ నిచ్చల్ మధ్య విభేదాలు బైటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో ఒక వర్గానికి..మరో వర్గానికి మధ్య పడటంలేదు.
‘సేవ వైఎస్సార్ సేవ జగన్’ పేరుతో నవీన్ నిచ్చల్ వర్గం సమావేశమైంది. దీంతో ఇక్బాల్ వర్గం ఆ సమావేశాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఆ సమావేశాన్ని అడ్డుకోవటానికి ఇక్బాల్ వర్గం యత్నించింది. ఈ క్రమంలో నవీన్ నిచ్చల్,ఇక్బాల్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనటంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.