చెక్కింగ్స్ : చెవిరెడ్డి ఫొటోలతో బ్యాగులు, క్రికెట్ కిట్స్

చంద్రగిరి : ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో భాగంగా..చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని పద్మావతిపురంలోని గోడౌన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోడగడియారాలు..స్కూల్ బ్యాగులు..వంటి పలు రకాల వస్తువులు లభ్యమయ్యాయి. వైఎస్ ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ప్రింట్ చేయించిన గోడ గడియారాలు, స్కూల్ బ్యాగులు, క్రికెట్ కిట్స్, బట్టలు బైటపడ్డాయి. ఓటర్లు పంచేందుకు చెవిరెడ్డి వీటిని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సమాచారం అందిన పోలీసులు చేపట్టిన తనిఖీలో పట్టుబడ్డ వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.