మరో ప్రాణం తీసిన పోలీస్ ఫిజికల్ టెస్ట్  

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 10:25 AM IST
మరో ప్రాణం తీసిన పోలీస్ ఫిజికల్ టెస్ట్  

రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకున్నది. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తు ఓ యువకుడు మృతి చెందాడు. త్వరలో జరగనున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం గురువారం (ఫిబ్రవరి14) ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా సడెన్ గా గుండెనొప్పి రావటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు మృతుడు ఇబ్రహీంపట్నం మండలం మేటిక గ్రామవాసి ఏకాంబరం(23)గా గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో..ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఆరాటంతో పోలీసు ఉద్యోగాల కోసం యువకులు వస్తున్నారు. కానీ ఫిజికల్ టెస్ట్ లలో ఇటువంటి విషాదాలు జరుగుతుండటం విచారకరం.