వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 12:54 AM IST
వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

Updated On : March 21, 2020 / 12:54 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. పేదలు అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుని వచ్చిన కార్యక్రమం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అనే పేరు ఖరారు చేసింది ప్రభుత్వం.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేవాటిలో అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీనిని భావిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలనేది ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. 

సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది ప్రభుత్వం. మిషన్‌ మోడ్‌లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలంటూ జీవోలో ఉంది. 
 

Also Read | ఛీటింగ్ : MBS jewellers అధినేత ఎక్కడ