YSRCPలో కలకలం : స్పృహ తప్పిన ధర్మాన

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 04:52 PM IST
YSRCPలో కలకలం : స్పృహ తప్పిన ధర్మాన

Updated On : March 18, 2019 / 4:52 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని పీఎన్ కాలనీలో వైసీపీ నిర్వహిస్తున్న ప్రచారంలో కలకలం రేపింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో స్టేజీపైనే కుప్పకూలిపోయారు. వెంటనే నేతలు అప్రమత్తమయ్యారు. ఆయనకు నేతలు సపర్యియలు చేపట్టారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ధర్మానను ఇంటికి వెళ్లిపోయారు. 

వైసీపీలో కీలక నేతగా ఉన్న ధర్మాన కొద్ది రోజుల నుండి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇడుపులపాయలో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో ధర్మాన అక్కడే ఉన్నారు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తుండగా ఆయన బ్రదర్ నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీలో ఉన్నారు. అనంతరం నేరుగా నియోజకవర్గంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. మార్చి 18వ తేదీ నామినేషన్ల పర్వం షురూ కూడా అయ్యింది. ధర్మాన కూడా ప్రచారం విస్తృతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

గత ఎన్నికల్లో ఆయన 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.