US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన హిప్పో “మూ డెంగ్”

హిప్పో "మూ డెంగ్‌" ఏ పుచ్చకాయను తింటే ఆ అభ్యర్థి అమెరికా ఎన్నికల్లో గెలుస్తారని అంచనా.

US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన హిప్పో “మూ డెంగ్”

Updated On : November 5, 2024 / 7:45 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉండనుందని ఇప్పటికే అనే సర్వేలు తేల్చాయి. ఇప్పుడు థాయిలాండ్‌లోని ఫేమస్‌ బేబీ పిగ్మీ హిప్పోపొటామస్ (నీటి ఏనుగు) కూడా తన అంచనాను తెలిపింది.

ఈ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుస్తారని సూచించింది. థాయిలాండ్‌లో ఈ హిప్పో “మూ డెంగ్‌” ప్రవక్త పాత్రను పోషిస్తుంది. నీటి గున్న ఏనుగు “మూ డెంగ్‌” నీళ్లలో నుంచి బయటకు వచ్చి తినేలా రెండు పుచ్చకాయలను ఉంచారు. ఆ కాయల్లో ఒకదానిపై డొనాల్డ్ ట్రంప్‌ పేరు, మరోదానిపై కమలా హారిస్‌ పేరును రాశారు.

హిప్పో “మూ డెంగ్‌” ఏ పుచ్చకాయను తింటే ఆ అభ్యర్థి అమెరికా ఎన్నికల్లో గెలిచినట్లు లెక్క. అది నేరుగా వెళ్లి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు రాసి ఉన్న పుచ్చకాయను తిన్నది. ఈ వీడియోను థాయ్‌లాండ్‌లోని సి రాచాలోని ఖావో ఖీవ్ ఓపెన్ జూలో రికార్డ్ చేశారు.

ఈ గున్న నీటి ఏనుగును చిన్నారి రాజకీయ విశ్లేషకురాలిగా ముద్దుగా పిలుచుకుంటారు. ఈ నీటి ఏనుగు ఈ ఏడాది జులైలోనే పుట్టింది. దీన్ని సెలబ్రిటీ హిప్పో అని అంటారు. థాయిలాండ్‌లో ఇంటర్నెట్‌లో ఈ నీటి ఏనుగు ఓ సెన్సేషన్‌.

Unstoppable 4 : సింహం, స‌మ‌ర‌సింహం క‌లిసిన వేళ‌.. వినోదానికి ఆకాశ‌మే హ‌ద్దు.. అన్‌స్టాప‌బుల్ మూడో ఎపిసోడ్ ప్రొమో చూశారా?