Unstoppable 4 : సింహం, సమరసింహం కలిసిన వేళ.. వినోదానికి ఆకాశమే హద్దు.. అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్రొమో చూశారా?
అన్ స్టాపబుల్ సీజన్ 4 మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.

Balakrishna Unstoppable Season 4 Episode 3 Promo release
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాగా రెండో ఎపిసోడ్‌కు లక్కీభాస్కర్ టీమ్ వచ్చింది. ఇక మూడో ఎపిసోడ్‌కు అతిథిగా ఎవరు వస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. తమిళ స్టార్ హీరో సూర్య అతిథిగా వచ్చాడు.
సూర్య నటించిన మూవీ కంగువా. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెరకెక్కింది. దిశా పటానీ కథనాయిక. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Chandini Chowdary : హీరోయిన్ చాందిని చౌదరికి గాయం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలుగమ్మాయి..
దాదాపు పది బాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషనల్ లో భాగంగా సూర్యతో పాటు కంగువా టీమ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4లో సందడి చేసింది.
ఇక బాలయ్య ఎప్పటిలాగానే చాలా హుషారుగా కనిపించారు. సూర్యతో పలు ఆటలను ఆడించారు. మొత్తంగా ప్రొమో ఆసక్తికరంగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 8 శుక్రవారం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?