Viral Video : అత్యంత రద్దీగా ఉండే బ్రిడ్జి మద్యలో సెలూన్–వైరల్ వీడియో
లాస్ ఏంజెల్స్‌లో నిత్యం రద్దీగా ఉండే సిక్స్త్ స్ట్రీట్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఒక బార్బర్ తన కస్టమర్‌కు కటింగ్ చేస్తూ కనిపించాడు.

Saloon At Bridge
Viral Video : ఇటీవల హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్ చేసి ఒక యువతి హల్ చల్ చేయటంతో మెట్రో అధికారులు కఠిన మైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇలా పబ్లిక్ ప్లేస్ లో ఏదో ఒకటి చేసి నలుగురిలో గుర్తింపు తెచ్చుకుందామని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు.
తాజాగా లాస్ ఏంజెల్స్‌లో నిత్యం రద్దీగా ఉండే సిక్స్త్ స్ట్రీట్ బ్రిడ్జిపై రాత్రి వేళ ఒక బార్బర్ తన కస్టమర్‌కు కటింగ్ చేస్తూ కనిపించాడు. రోడ్డు మధ్యలో బార్బర్ పనిచేస్తూ ఉండే సరికి స్పీడ్ గా వచ్చిన వాహనాలు కాస్త అక్కడకొచ్చేసరికి స్లోచేసుకుని వెళ్ళటం మొదలెట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి సిక్స్త్ స్ట్రిట్ వద్ద రద్దీ ఎక్కువ ఉంటోందనే ఈ బ్రిడ్జి నిర్మించారు. దీంతో అక్కడ వాహానదారులకు చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి.
ఈ వీడియోను బాయిల్ హైట్స్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. లాస్ ఏంజెల్స్‌లో రెండు వారాల క్రితమే ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రి ఈ బ్రిడ్జిపై రెండు లేన్ల మధ్యలో ఓ కుర్చీలో కస్టమర్ కూర్చొని ఉన్నాడు. బార్బర్ ప్రశాంతంగా అతనికి హెయిర్‌కట్ చేస్తున్నాడు. వాహనాలు వారి దగ్గరకు రాగానే స్లో అవుతూ వెళ్లడం కనిపించింది. అయితే, ఆ బార్బర్ ఇలా ఎందుకు చేశాడనే వివరాలు తెలియరాలేదు.
Man gets haircut in the middle of the 6th Street Bridge in Boyle Heights pic.twitter.com/20d8jzZAeC
— Boyle Heights (@boyle_hts) July 21, 2022