Viral Video: బైక్‌పై విచ్చలవిడిగా ప్రవర్తించిన జంట.. పోలీసులు ఏం చేశారంటే

తాజాగా చత్తీస్‌గఢ్‌, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై ఎదురుగా కూర్చుంది. దీంతో ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అది కూడా బైకు రైడ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించారు.

Viral Video: బైక్‌పై విచ్చలవిడిగా ప్రవర్తించిన జంట.. పోలీసులు ఏం చేశారంటే

Updated On : January 23, 2023 / 9:51 AM IST

Viral Video: పబ్లిక్ ప్లేసుల్లో కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచిపోతున్నారు. బైకు రైడ్ చేస్తూ, అదే బైక్‌పై రొమాన్స్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనల్ని చుట్టుపక్కల వాళ్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి

తాజాగా చత్తీస్‌గఢ్‌, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై ఎదురుగా కూర్చుంది. దీంతో ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అది కూడా బైకు రైడ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించారు. ఇది అభ్యంతరకరమే కాదు.. ప్రమాదకరం కూడా. పొరపాటున బైకు పై నుంచి పడితే వాళ్లతోపాటు, పక్కన వెళ్లే వారికీ ప్రమాదకరమే. ఈ జంట అలా బైకుపై వెళ్తుండగా, ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకుపై ఉన్న జంటపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు.

Hockey World Cup: హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమణ

ఈ వీడియోలో కనిపించిన బైక్‌కు నెంబర్ లేదు. ఈ బైక్ రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినప్పటికీ విచారణ జరిపిన పోలీసులు బైక్‌తోపాటు, జంటను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కాగా, విచారణలో మరో విషయం బయటపడింది. ఈ వీడియోలో కనిపించిన బైక్ ఉత్తర ప్రదేశ్‌లో చోరీకి గురైంది. దీని అసలు ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. కానీ, దీన్ని ఆ వ్యక్తి రూ.9,000కే కొని వాడుతున్నాడు. దొంగ బండి కావడంతో రిజిస్ట్రేషన్ చేయించలేదు. దీనిపై కూడా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.