నాన్నా.. కరోనా వస్తది బయటకెళ్లొద్దు: గుండెలు పిండేసే వీడియో

  • Published By: veegamteam ,Published On : March 26, 2020 / 06:07 AM IST
నాన్నా.. కరోనా వస్తది బయటకెళ్లొద్దు: గుండెలు పిండేసే వీడియో

Updated On : March 26, 2020 / 6:07 AM IST

లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు బయటకి రావద్దని ప్రభుత్వం మోత్తుకుంటుంది. కానీ, ఎవ్వరూ ప్రభుత్వం మాట వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రజలను కాపాడేందుకు పోలీసులు ఇంటికి కూడా వెళ్లకుండా రోడ్లపైనే గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల చేతుల్లో దెబ్బలు కూడా తింటున్నారు.

కానీ, తమ కుటుంబాన్ని వదిలి రోజులతరబడి బయట గడపాల్సిన అవసరం మాకేంటని వాళ్లు అనుకుంటే అందరూ వ్యాధికి గురౌతారు. అయితే మన భద్రత కోసం ఇంటికి కూడా వెళ్లకుండా 24గంటలు రోడ్లపైనే ఉంటున్న పోలీసు కుటుంబం ఎంత బాధపడుతోందో.. వారి పిల్లలు ఎలా ఏడుస్తున్నారో ఈ వీడియో చూడండి అర్ధమౌతుంది.

ముంబయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీకి హాజరయ్యేందుకు రెడీ అవుతుంటే.. అతని కొడుకు ఇంట్లోనే తనతోపాటే ఉండాలని ఏడుస్తున్న వీడియో చూస్తే గుండె బరువెక్కుతుంది. నాన్న ఇంట్లోనే ఉండు నానా. బయటకు వెళ్లొద్దు కరోనా వస్తది అంటూ ఏడుస్తున్న ఆ పిల్లాడిని తండ్రి ఎత్తుకుని.. నాకేం కాదు రా అంటూ ప్రయత్నం చేయడాన్ని ఈ వీడియోలో చూడండి. 

ఆ కానిస్టేబుల్‌లాగానే ఎందరో పోలీసులు మన కోసం రోడ్లపైకి వస్తున్నారు. మనకు కరోనా రాకుండా ఉండేందుకు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి డ్యూటీకి వస్తున్నారు. కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా వారి మాట వినండి. బయటకు వెళ్లేప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ కోసం డాక్టర్లు, పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. వారిపై గౌరవం.. మన ప్రాణాలపై భయం ఉంటే ఇంట్లోనే ఉండండి.

Also Read | హ్యాట్సాఫ్ సీఎం సార్: అర్థరాత్రి అమ్మాయిలకు సాయంగా..