ఆ ఐదుగురిపై పగ తీర్చుకున్న బర్రె.. వీడియో వైరల్

  • Published By: dharani ,Published On : May 26, 2020 / 10:05 AM IST
ఆ ఐదుగురిపై పగ తీర్చుకున్న బర్రె.. వీడియో వైరల్

Updated On : May 26, 2020 / 10:05 AM IST

నేషనల్ హైవేపై ఐదుగురు ఆకతాయిలు రెండు ఎడ్ల బండికి గేదెల్ని తగిలించి ఒకరికొకరు పోటీపడుతున్నారు. వారి సంతోషం కోసం ఆ  మూగ జీవాల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసించారు. దీంతో ఓపిక నషించిన గేదె రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మీదిగా వెళ్లింది. అంతే.. బండిపై ఉన్నవారు ఎగిరి కిందపడ్డారు. అక్కడే ఉన్న కొంతమంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెటిజన్లు వీడియో చూసి బర్రె బలే పగతీర్చుకుంది వాళ్లకి అంతేకావాలి అంటూ కమెంట్ చేస్తున్నారు.

ఎవరికైనా సహనం అనేది కాసేపటి వరకే ఉంటుంది. ఆ సహనం కనుక చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమౌతుంది. ప్రస్తుతం ఆ వీడియోకు 1.4 మిలియన్ వ్యూస్ రాగా, 43వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది బండిని నడుపుతున్న ప్రజలను అమానవీయ అని విమర్శించారు. అంతేకాదు వారిని జంతు క్రూరత్వం కోసం కేసు పెట్టాలని సూచించారు.

ఈ వీడియోను బెంగళూర్ కు చెందిన IFS అధికారి ప్రవీణ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోను 1.4 మిలియన్ల మంది చూశారు, 43వేల మంది లైక్ చేశారు.  ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

Read: రా ఆడుకుందాం : అందాల నెమలితో చిట్టి ఉడత పరాచికాలు చూడండీ..