తల్లి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ కి ఆనందం పట్టలేక ఏడ్చేసిన పిల్లవాడు

సాధారణంగా మనకి ఎంతో ఇష్టమైన వస్తువులను మనకి ఇష్టమైన వాళ్ళు బహుమతిగా ఇస్తే, వాటి నుంచి పొందే ఆనందాన్నికి హద్దులు ఉండవు. దానితో మనం కోరుకున్నది మన కళ్ల ముందు ప్రత్యక్షమౌవ్వటంతో సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తాయి. అచ్చంగా అలాంటి పరిస్థితిని ఓ బాలుడు ఎదుర్కొన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన కుక్క పిల్లలను తల్లి ఇంటికి తీసుకువచ్చి, ఆశ్చర్యాన్ని కలిగించటంతో ఆ బాలుడు సంతోషంతో ఏడ్చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే… ఓ పిల్లవాడు సోఫాలో కూర్చోని తన మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అతని తల్లి ఆ పిల్లవాడికి ఎంతో ఇష్టమైన ఒక క్యూట్ కుక్కపిల్లని ఆ బాలుడికి తెలియకుండా తీసుకువచ్చి ఆశ్చర్యాన్నికి గురి చేస్తుంది. కుక్క పిల్లలంటే ఆ బాలుడికి చాలా ఇష్టం. దాంతో తనకి ఎంతో ఇష్టమైన కుక్క పిల్లను తల్లి తీసుకువచ్చి ఇవ్వటంతో, ఒక్కసారిగా ఆ కుక్క పిల్లను చూసి ఆనందంతో ఏడ్చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియోను ‘సైమన్ బీఆర్‌ఎఫ్‌సీ హాప్కిన్స్’ అనే ట్వీటర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానితో పాటు‘అతడు ఎల్లప్పుడూ కుక్క పిల్లలను ఇష్టపడతాడు. తన తల్లి క్యూట్ కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చినప్పుడు అతని స్పందన ఎలా ఉందో చూడండి’అనే క్యాప్షన్ ను పెట్టింది. ఇప్పటికే ఈ వీడియోని 3వేల మందికి పైగా వీక్షించారు. వందలకు పైగా లైకులు వచ్చాయి.
ఈ వీడియోలో బాలుడి ఇష్టాన్ని తెలుసుకుని తీర్చినందుకు, ఆ తల్లిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ కుక్కపిల్ల బాలుడి అద్భుతమైన జీవితానికి నాంది పలికింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ఒక అందమైన కానుక అని మరోక నెటిజన్ కామెంట్ చేశాడు.
He’s always wanted a puppy and this is his reaction when his mum brings one home ?❤️ pic.twitter.com/7abViU4RF6
— ⚽ Simon BRFC Hopkins ⚽ (@HopkinsBRFC) September 23, 2020