మిలింద్ న్యూడ్ రన్నింగ్.. కేసు నమోదు

Milind Soman:పూనమ్ పాండే తర్వాత మిలింద్ సోమన్‌పై అదే తరహా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 294, 67ల ప్రకారం కేసు ఫైల్ అయిందని న్యూస్ ఏజెన్సీ చెప్పింది. యాక్టర్, ఫిట్‌నెస్ ఎంతుయాజిస్ట్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కారణంగా అతనిపై కేసు నమోదు అయింది. బీచ్ లో న్యూడ్ గా రన్నింగ్ చేస్తున్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
గురువారం న్యూడ్ గా రన్నింగ్ చేసినందుకు గానూ సౌత్ గోవా పోలీసులు కేసు బుక్ చేశారు. ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ కొల్వా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 294, సెక్షన్ 6 ప్రకారం.. కేసు నమోదు చేశారు. ‘సురక్షా మంచ్ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యూడ్ గా రన్నింగ్ చేసిన సోమన్ పై దక్షిణ గోవా పోలీసులకు కంప్లైంట్ చేశాం’ అన్నారు.
అసలు ఏం జరిగిందంటే..
మిలింద్ సోమన్.. 55వ బర్త్ డే సందర్భంగా నగ్నంగా బీచ్ లో పరిగెడుతుండగా అతని భార్య అంకితా కొన్వార్ ఫొటో తీసింది. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన మిలింద్ ‘హ్యాపీ బర్త్ డే టూ మీ’ అంటూ రాసుకొచ్చి పోస్టు పెట్టాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమే మిలింద్, అంకితాలు గోవాకు వెళ్లారు.
గురువారం పూనమ్ పాండే, ఆమె భర్త శ్యాం బాంబేను గోవా పోలీసులు అడ్డుకున్నారు. చపోలీ డ్యాం వద్ద గవర్నమెంట్ ప్రాపర్టీలో అసభ్యకరమైన వీడియో షూట్ చేస్తుండగా అడ్డగిచారు. మిలింద్ పోస్టు వైరల్ అయిన తర్వాత చాలా మంది నెటిజన్స్ హిపోక్రసీ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ జంటకు బెయిల్ దొరికింది. పూనమ్, శామ్ లకు రూ.20వేల బెయిల్ బ్యాండ్ లభించింది.