స్కూల్ ప్యూనే లెక్కల మాస్టారు..టీచింగ్ సూపర్ అంటున్న విద్యార్ధులు

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 07:01 AM IST
స్కూల్ ప్యూనే లెక్కల మాస్టారు..టీచింగ్ సూపర్ అంటున్న విద్యార్ధులు

Updated On : February 29, 2020 / 7:01 AM IST

హర్యానాలోని అంబాలలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో ప్యూన్ విద్యార్ధులకు లెక్కల పాఠాలు చెబుతున్నారు. పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వింటున్నారు. ఇదేంటి ప్యూన్ లెక్కల లెసన్స్ చెప్పటమేంటి? అతనికి అంత సామర్థ్యం ఎక్కడిది? దీనికి అధికారులు ఏమీ అనటంలేదా అనే అనుమానాలు రావచ్చు..

వివరాల్లోకి వెళితే.. అంబాలలోని మజ్రీ గ్రామంలో ఓ గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 400 మంది విద్యార్ధులున్నారు. వారికి 19మంది టీచర్లు ఉన్నారు. కానీ ఈ 400ల మంది విద్యార్ధులకు లెక్కల పాఠాలు చెప్పటానికి ఒకే ఒక్క మాస్టారున్నారు. అంతమందికి అన్ని క్లాసులు తీసుకోవటంతో ఆ టీచర్ తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు.  విద్యార్ధులకు వారానికి 54 క్లాసులు (పీరియడ్స్)తీసుకుంటూ లెక్కల పాఠాలు చెప్పాల్సివస్తోంది. దీంతో అతనికి విశ్రాంతి ఉండటంలేదు. కానీ తప్పటం లేదు. దీంతో పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు సదరు టీచర్. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు.

దీంతో ఆ స్కూల్లోనే ప్యూన్ గా పనిచేసే కమల్ సింగ్ తో 9th క్లాస్ విద్యార్ధులకు లెక్కల లెసన్ చెప్పిస్తున్నారు. ప్యూన్ చెప్పే లెక్కలను విద్యార్ధులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. అతని టీచింగ్ అంతగా విద్యార్ధుల్ని ఆకట్టుకుంది. ప్యూన్ అంటే ఏదో 10th క్లాస్ చదివినవాడు కాదు కమల్ సింగ్. అతను ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ పట్టా పొందినవాడు కమల్ సింగ్. అతను చెప్పే లెక్కల లెసన్స్ ను విద్యార్ధులు చక్కగా ఆస్వాదిస్తూ వింటున్నారు. 

Also Read | మార్కుల దానం: ఆన్సర్ పేపర్‌లో స్టూడెంట్ రిక్వెస్ట్.. టీచర్ ఫిదా!

ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పడుతున్న ఇబ్బందులు గమనించిన ప్యూన్ కమల్ సింగ్ హెడ్ మాస్టర్ వద్దకు వెళ్లి..సార్..నేను మ్యాథ్స్ టీచింగ్ చేస్తానని చెప్పాడు. దానికి హెడ్ మాస్టర్ వేరే దారిలేక ఒప్పుకున్నారు. ఆ స్కూల్ కు లెక్కల మాస్టారు వచ్చిన తరువాత కూడా వారానికి 17 నుంచి 18 క్లాసులు తనకు ఇవ్వాలని కోరాడు. అప్పటి నుంచి విద్యార్దులకు లెక్కల క్లాసులు తీసుకుంటున్నాడు కమల్ సింగ్. కమల్ సింగ్ టీచింగ్ చాలా చాలా బాగుందని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ విషయంపై జిల్లా డిప్యూటీ డీఈవో సుధీర్ కల్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమల్ పాఠాలు చెప్పటానికి అనర్హుడని తేల్చారు. 9 నుండి 12 క్లాసుల కు పాఠాలు చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి కానీ ప్యూన్ గా ఉండే కమల్ సింగ్ టీచింగ్ చెబుతున్న విధానం నచ్చి అతనికి మద్దతునిచ్చారు. కమల్ తన ప్యూన్ డ్యూటీతో పాటు అదనంగా వర్క్ చేస్తుండటాన్ని అభినందించారు. అంతేకాదు స్కూల్లో కమల్ సింగ్ ప్యూన్ డ్యూటీని కేవలం పనిగానే కాక అంకిత భావంతో పనిచేస్తున్నాడనీ అతనిలో అచ్చమైన గురువు లక్షణాలు కనిపిస్తున్నాయని అభినందించారు.