వీడియో : మొండి ధైర్యం.. మోకాలు విరిగినా మ్యాచ్ ఆడిన మహిళా కెప్టెన్

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 05:52 AM IST
వీడియో : మొండి ధైర్యం.. మోకాలు విరిగినా మ్యాచ్ ఆడిన మహిళా కెప్టెన్

Updated On : February 27, 2020 / 5:52 AM IST

కొన్ని సందర్భాల్లో క్రీడాకారులు మైదానంలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా కొన్ని సార్లు దెబ్బలు తగులుతాయి. ఆసమయంలో దెబ్బలు త్రీవంగా తగిలిన కొంతమంది క్రీడాకారులు మాత్రం లెక్క చేయకుండా ఆటను కొనసాగిస్తారు. తాజాగా ఓ పుట్ బాల్ క్రీడాకారిణి జేన్ ఓ టూల్ తన మోకాలికి దెబ్బ తగిలిన, అది లెక్క చేయకుండా ఆటను కొనసాగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్కాటిష్ మహిళల ఛాంపియన్ షిప్ కప్ కోసం పుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సెయింట్ మిర్రెన్ మహిళల జట్టు, ఇన్వర్నెస్ కాలెడోనియన్ తిస్టిల్ జట్టుల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్ జోరుగా సాగుతున్న సమయంలో స్కాటిష్ పుట్ బాల్ జట్టు కెప్టెన్ జేన్ ఓ టూల్ ప్రత్యర్ధితో బాల్ కోసం  పోరాడుతున్న సమయంలో ఒక్కసారిగా మోకాలు నేలకు గుద్దుకోని కింద పడిపోయింది. ఆ సమయంలో మోకాలు చిప్ప పక్కకు జరిగింది. టూల్ భయపడకుండా, నొప్పిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పిడికితో మోకాలుపై కొడుతూ సరి చేసుకుని, తిరిగి ఆటను 90 నిమిషాల పాటు కొనసాగించింది.

సెయింట్ మిర్రెన్ పుట్ బాల్ జట్టు ఈ వీడియోని షేర్ చేస్తూ.. మా కెప్టెన్ జేన్ ఓ టూల్ ఎలాంటి కఠినమైన పరిస్ధితులనైనా ఎదుర్కొంటారు. ఇటీవల ఇన్వర్నెస్ జట్టుతో జరిగిన పుట్ బాల్ మ్యాచ్ లో మోకాలి చిప్పకు దెబ్బ తగిలిన సమయంలో తాను వ్యవహరించిన తీరును చూడండి. ఇలాంటి శక్తివంతమైన స్త్రీని ఎవరు అణిచివేయలేరు అనే క్యాప్షన్ తో పోస్టు చేసింది. 

ఇప్పటివరకు ఈ వీడియోకి లక్షకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన వారందరు ఆమె ధైర్య సాహాసాలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈమె వుండర్ వుమెన్ అంటూ కామెంట్ చేశారు. కొంతమంది నెటిజన్లు పురుష పుట్ బాల్ క్రీడాకారులు ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.