రా ఆడుకుందాం : అందాల నెమలితో చిట్టి ఉడుత పరాచికాలు చూడండీ..

ఈ వీడియోని చూస్తే..కళ్లు తిప్పుకోలేరు. ఏమి ఈ చిట్టి ఉడత చిలిపి చేష్టలు అనుకోవాల్సిందే. తన పేద్ద పొడవాటి తోక ఉన్న ఓ అందమైన నెమలి. అంతకంటే ముద్దు ముద్దుగా ఉండే ఓ చిట్టి ఉడుత. నెమలీ..చిట్టి పొట్టి ఉడుతల మధ్య జరిగిన చక్కటి సీన్ మనల్ని కట్టిపడేస్తుంది. తనకున్న పెద్ద తోకను తిప్పుకుంటూ తిరగే అందాల నెమలి తోకలోని ఓ ఈకను తన నోటితో పట్టుకుని లాగుతోంది చిట్టి ఉడుత. ఏయ్..ఏంటిది..వదులు..నా తోకని అంటూ ఆ మయూరం అటూ ఇటూ పరుగెడుతోంది.
కానీ ఆ బుడ్డి ఉడుత మాత్రం వదల్లేదు..రా..ఆడుకుందాం..ఈరోజు నిన్ను వదలను అంటున్నట్లుగా తోక ఏమాత్రం వదలకుండా వెంటపడింది. ఏయ్..వదలకపోతే..పొడుస్తా అన్నట్లుగా ఆ ఉడుతను తన ముక్కుతో పొడుస్తున్నట్లుగా బెదిరించింది నెమలి. అంతే బాబోయ్..నెమలి ఒక్కపోటు పొడిచిందంటే నా పని హరీ..అనుకుందో ఏమోగానీ ఉడుత నెమలి తోకని వదిలేసింది.
కానీ అక్కడే దూరంగా ఉండి నెమలి వంక చూస్తుండి పోయింది. ఈ వీడియోని భారతీయ అటవీశాఖా అధికారి సుశాంతనంద తన ట్విట్టర్ లో ఈరోజే (మే 26,2020)న పోస్ట్ చేశారు. ఏడు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసినవారిని ఆకట్టుకుంటోంది. మరి మీరు కూడా ఆ చిట్టి ఉడత చిలిపి గంతుల్ని వీక్షించండీ..
Aaj Na Chhodenge Bas Humjoli?
(Today I’ll not leave you my companion)
?In the clip pic.twitter.com/9bHF9dH7rd— Susanta Nanda IFS (@susantananda3) May 26, 2020
Read: వామ్మో..బామ్మా..ఏమి నీ ధైర్యం !..భారీ తాచుపాముని చేత్తో పట్టుకెళ్లి అవతలపారేసింది