శివ గారూ.. మా అమ్మ మమ్మల్ని ఇంకా చిన్న పిల్లలు మాదిరిగానే చూస్తోంది..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరి నుండి మరొకరికి చేరుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ని సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసిన సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, ఆపై దానిని యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు విసరిన సంగతి తెలిసిందే. అయితే విజయ్, శివ విసిరిన ఛాలెంజ్‌పై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
‘శివ గారు మా అమ్మ మమ్మల్ని ఇంట్లో పనులు చేయనీయడం లేదు.. పని డబుల్ అవుతుంది అంట. మమ్మల్ని రియల్ మెన్‌గా కాదు, ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే చూస్తోంది. అయినప్పటికీ ఈ లాక్‌డౌన్ ముగిసేలోపు ఏదో విధంగా మీరు ఇచ్చిన ఛాలెంజ్‌ని సక్సెస్ఫుల్‌గా పూర్తి చేస్తాను’ అంటూ విజయ్ ఫన్నీగా ట్వీట్ చేయడం జరిగింది. కాగా విజయ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.