Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంది.
మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు 36 నుండి 40 సెంటిగ్రేడ్ వరకు ఉండనున్నాయంది. ఉదయం ఎండలు ఉంటాయని, మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుందని వెల్లడించింది.