Hyderabad Terror Bid Foiled: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు..
ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ నిర్వహించారు.

Hyderabad Terror Bid Foiled: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. సిరాజ్, సమీర్ తో పాటు ఆరుగురు వ్యక్తుల ఇన్‌స్టా లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో కర్నాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఉన్నారు. ఈ ఆరుగురు గ్యాంగ్ హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో బటయపడింది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు.
టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు వచ్చాయని, మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్‌లో టిఫిన్ బాక్స్‌లు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేశాడు సిరాజ్. నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్‌లో సమీర్ అరెస్ట్ అయ్యారు. ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్ట్ సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు.
తెలంగాణకు చెందిన సిరాజ్, సమీర్ ను అరెస్ట్ చేసిన విజయనగరం జిల్లా కోర్టులో నిన్న హాజరుపరిచారు. వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. గ్రూప్ 2 కోచింగా కోసం హైదరాబాద్ వచ్చిన సిరాజ్.. పెద్ద ఎత్తున ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి గ్రూప్ తయారు చేశాడు. అందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ వాళ్లు గ్రూప్ గా క్రియేట్ అయ్యారు.
ఇన్ స్టా వేదికగా మీటింగ్ లు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో వీరు మూడు రోజులు పాటు సంచరించారు. ఐసిస్ కార్యకలాపాలకు ఆకర్షితులై వారితో చేతులు కలిపి బ్లాస్ట్ లకు కుట్ర పన్నారు. సౌదీ హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ వచ్చారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఏక కాలంలో సంయుక్తంగా వారిని అరెస్ట్ చేసి విజయనగరం తరలించారు.
సిరాజ్ నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు సీజ్ చేశారు పోలీసులు. టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్నట్లు గుర్తించారు. కొందరికి బాంబులు తయారు చేయాలని, మరికొందరికి టార్గెట్లు ఫిక్స్ చేయాలని ఆదేశాలు అందాయి. సౌదీ హ్యాండ్లర్ నుంచి ఆదేశాలు అందగా, వీరు ఇక్కడ అమలు చేసేందుకు కుట్ర చేశారు. ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్, సమీర్ లను కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. మొత్తం ఆరుగురి గ్యాంగ్ లో ఇద్దరినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.