Weather Updates: ఏపీలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. పిడుగులు పడే అవకాశం..

ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

Weather Updates: ఏపీలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. పిడుగులు పడే అవకాశం..

Heavy Rains Alert

Updated On : September 16, 2025 / 1:56 AM IST

Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

మంగళవారం (16-09-25)
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
* మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

ఇక, సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 57మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరంలో 42 మిమీ, కాకినాడ జిల్లా పిఠాపురంలో 37.2 మిమీ, కందరాడలో 36.7 మిమీ, ర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 34.5 మిమీ, రాజానగరంలో 33.7 మిమీ, కాకినాడలో 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది.